Saturday, March 13, 2010
Telangana Songs
Posted on 7:37 AM by telangana yuvasena
సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా
పల్లెల్లని పాడుబడ్డై
నీలు లేక నల్ల బడ్డాయి.
పాలమూరు పాడాయే
కరీంనగర్ కుళ్ళి పాయె
ఆదిలాబాదు అరవబట్టే
నిజామాబాదు నల్లగొండ
ఖమ్మములో కరువోచ్చే
వరంగల్లు వంటింట్లో కుండలు కొట్లాడబట్టే
మెదకేమో మోడుబారే కండ్లెంబడి నీళుకారే
తాగానీకే కరువాయే కనీల్లె ఎరాయే
సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా
అభివృద్ధి అంటాడు
అంత మీకే ఆంటాడు
ఆ ప్రాజెక్ట్ అంటాడు ఈ ప్రాజెక్ట్ అంటాడు
ఆరేళ్ళు గడచిపాయే అరలీటరు తేకపాయే
మట్టి కుండ ఆస సూపి ఎండి బిందె ఎత్క పాయె
సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా
లగడగాడు జగడమాడే
టి జి గాడు పేచి పెట్టె
ఆడు ఈడు ఎగరబట్టే
మన బ్రతుకులు మనకంటే
కండ్లేందుకు మండబట్టే
సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా
కృష్ణమ్మా వచేనమ్మ తెలంగాణా
నీ కస్టాలు తీర్చలేదు తెలంగాణా
గోదారి గయ్యాళి తెలంగాణా
నీకు సవతిపోరు తప్పలేదు తెలంగాణా
సింగరేణి కాలనీలు తెలంగాణా
నీ సిగతరిగి నవ్వేనమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||
రాష్ట్రమంతా పచ్చదనం తెలంగాణా
నీ నేలంతా కరవుమయం తెలంగాణా
పెద్ద పెద్ద పట్టణాలు తెలంగాణా
నీకు పెద్దదిక్కు లేదమ్మా తెలంగాణా
చిన్న ప్రాజెక్టులు తెలంగాణా
అవే నీకు పదివేలు తెలంగాణా
||ఎక్కి ఎక్కి||
నాగార్జున సాగారమ్మ తెలంగాణా
నాల్గు సుక్కలైన లేవమ్మ తెలంగాణా
పోలవరం ప్రాజెక్టు తెలంగాణా
నీ పోలు తేంపినాదమ్మ తెలంగాణా
పోతిరెడ్డి పాడమ్మ తెలంగాణా
నీకు పాడే కట్టనుందమ్మ తెలంగాణా
సుంకాసుల, దేవాదుల తెలంగాణా
సూసి ముర్వనీకే ఉన్నయమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||
అండి గిండి అనేటోల్లకు తెలంగాణా
అహ దండిగా ధనముందమ్మ తెలంగాణా
మన పోరి పోరగాలు తెలంగాణా
అహ పాచి పని చేయబట్టే తెలంగాణా
ఆ రైతు హాయిగుండు తెలంగాణా
మరి మన రైతు మూల్గుతుండు తెలంగాణా
పప్పన్నం దేవుడెరుగు తెలంగాణా
సుక్క ఇసమైన కోనకున్నడు తెలంగాణా
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా
Subscribe to:
Post Comments (Atom)
No Response to "Telangana Songs"
Leave A Reply