Saturday, March 13, 2010
ఓ తెలంగాణ తల్లీ…
Posted on 7:35 AM by telangana yuvasena
ఓ తెలంగాణ తల్లీ…
ఓ తెలంగాణ తల్లీ…
నీ మీద మా ప్రేమ కళ్లారా సూడమ్మ
నీ మీద మమకారం కడుపార నింపుకొని
నీళ్లియ్యని నీ నదులను మా కన్నీలతో నింపుతున్నం
పాలియ్యని నీ పైరులకు మా రక్తాన్ని తాపుతున్నం
బువ్వెట్టని నిను మేము భుజాన ఎత్తుకున్నం
ఓ తెలంగాణ తల్లీ…
ఓ తెలంగాణ తల్లీ…
నీ పచ్చని చీరకోసం ప్రాణాలు ఇస్తున్నం
నీ నొసట బొట్టుకోసం ఇన్నేండ్లు పోరాడినం
నీ గాజుల గల గల కు గుండె కోసి ఇస్తున్నం
నీ మెట్టెల సప్పుడుకై చెవుల కొక్కరిస్తున్నం
ఓ తెలంగాణ తల్లీ…
ఓ తెలంగాణ తల్లీ…
నీ కడుపున పుట్టినందుకు ఓ తెలంగాణ తల్లీ…
నీ ఋణం తీర్సుకునే దాక నిద్రబోము నా తల్లి
దేనికైనా సిద్దమంది మా విద్ద్యార్ది లోకం
కన్న తల్లి కన్నీటిని కడ సారి తూడ్చేస్తం
నా తల్లి తెలంగాణ కోసం ఉక్కు పిడికిలి బిగిస్తం
ఊపిరాగిపోయే దాక అలుపెరగక పోరాడుతం
జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No Response to "ఓ తెలంగాణ తల్లీ…"
Leave A Reply