Thursday, January 20, 2011
చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు
Posted on 10:33 AM by telangana yuvasena
చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు
చెమ్మ గిల్లకే మా యమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ
నేను లేనని బాధపడకు...
నన్ను తలచి దిగులు చెందకు 2
తిరిగి రానని మరచి పోకు
కానరానని కలత చెందకు 2
నీ శ్వాస లో నేనున్నమ్మ...
నే చేసిన భాసలు మర్వనమ్మ...
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ
తెలంగాణా జెండా పట్టి...
తెలంగాణా కి జై కొట్టి.. 2
పోలిసోలకు ఎదురు నిలిచి..
లాటి తూటా రుచిని చూసి.. 2
బడే బేజార్ అయిననమ్మ
నే అగ్నికి కి ఆహుతి అయిననమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ
చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు
చెమ్మ గిల్లకే మా యమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ
Subscribe to:
Post Comments (Atom)
No Response to "చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు"
Leave A Reply