Thursday, January 20, 2011
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా
కృష్ణమ్మా వచేనమ్మ తెలంగాణా
నీ కస్టాలు తీర్చలేదు తెలంగాణా
గోదారి గయ్యాళి తెలంగాణా
నీకు సవతిపోరు తప్పలేదు తెలంగాణా
సింగరేణి కాలనీలు తెలంగాణా
నీ సిగతరిగి నవ్వేనమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||
రాష్ట్రమంతా పచ్చదనం తెలంగాణా
నీ నేలంతా కరవుమయం తెలంగాణా
పెద్ద పెద్ద పట్టణాలు తెలంగాణా
నీకు పెద్దదిక్కు లేదమ్మా తెలంగాణా
చిన్న ప్రాజెక్టులు తెలంగాణా
అవే నీకు పదివేలు తెలంగాణా
||ఎక్కి ఎక్కి||
నాగార్జున సాగారమ్మ తెలంగాణా
నాల్గు సుక్కలైన లేవమ్మ తెలంగాణా
పోలవరం ప్రాజెక్టు తెలంగాణా
నీ పోలు తేంపినాదమ్మ తెలంగాణా
పోతిరెడ్డి పాడమ్మ తెలంగాణా
నీకు పాడే కట్టనుందమ్మ తెలంగాణా
సుంకాసుల, దేవాదుల తెలంగాణా
సూసి ముర్వనీకే ఉన్నయమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||
అండి గిండి అనేటోల్లకు తెలంగాణా
అహ దండిగా ధనముందమ్మ తెలంగాణా
మన పోరి పోరగాలు తెలంగాణా
అహ పాచి పని చేయబట్టే తెలంగాణా
ఆ రైతు హాయిగుండు తెలంగాణా
మరి మన రైతు మూల్గుతుండు తెలంగాణా
పప్పన్నం దేవుడెరుగు తెలంగాణా
సుక్క ఇసమైన కోనకున్నడు తెలంగాణా
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా
No Response to "ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా"
Leave A Reply