Thursday, January 20, 2011

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే

Posted on 10:28 AM by telangana yuvasena

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే

పంతొమ్మిది వందల అరవై తొమిది నుండి ||2||
ఇగ ఇస్తం ఆగ ఇస్తం అని మీరు చెప్పుతుండ్రు ||2||
ఇచ్చుడేమో దేవుడెరుగు ఉన్నదంత దోచుకుండ్రు||2||
ఇచుడెందో తెచ్చుడేందో చీకట్లో చిందులేందో||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా


ఉస్మానియా క్యాంపస్లా ఉద్యమాలు రేగుతుంటే||2||
కాలేజి పోరగాల్ల కాలు చేతులిరుగుతుంటే ||2||
పుట్టకొకడు చేట్టుకొకడు పిట్టలోలె రాలుతుంటే||2||
ఉలుకు లేదు పలుకులేదు ఓదార్పు యాత్ర లేదు||2||


ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ యాష్కన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా దామన్న


డిసెంబెర్ నేలమోతం దిష్టి బొమ్మలైనారు||2||
డిల్లి నుండి గల్లిదాక గాజులేసి తిరిగిండ్రు ||2||
సుద్దపూసలోలె మీరు సాపనేక్కి కూసుండ్రు||2||
నీళ్ళు ఉన్న కాడ మీరు నీలాడతనంటారు ||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సతేన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ మందన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న

No Response to "ఇచేది మీరే అరె తెచ్చేది మీరే"

Leave A Reply