Saturday, March 13, 2010

జాగృతినుంచి విముక్తి దాకా

Posted on 7:52 AM by telangana yuvasena

హైదరాబాదులో ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘ సంస్కరణ మహాసభకు కార్వే పండితుడు హాజరయ్యారు. సభలో ప్రసంగాలన్నీ ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లోనే సాగుతూ వచ్చినాయి. ఆలంపల్లి వెంక ట రామారావు తెలుగులో ప్రసంగించడానికి ఉపక్రమించగా మహారాష్ట్రులు అడ్డు తగిలి ఆయన్ని మాట్లాడనివ్వలేదు. తెలుగు భాషకు జరిగిన ఈ అవమానాన్ని జీర్ణిం చుకోలేక అదే రాత్రి టేకుమాల రంగారావు గృహంలో కొందరు ప్రముఖులు మాడ పాటి హనుమంతరావు ఆధ్వర్యంలో సమావేశమై ‘ఆంధ్ర జనసంఘం’ను స్థాపిం చారు. ఆంధ్రుల సాంస్క ృతిక అభ్యున్నతికి పాటుపడే లక్ష్యంతో నియమావళి రూపొందించుకొని సభలూ, సమావేశాలూ జరుపుతూ వచ్చినారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో అక్కడక్కడా ఈ సంఘంకు శాఖలేర్పడి కార్యకమాలు నిర్వహిస్తూ వచ్చినాయి. ఐతే వీటన్నిటినీ క్రమబద్ధీకరించి సమన్వయ పరచడం కోసం ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’ ఏర్పడింది. దీనికి ఆలోచన, రూపకల్పన హనుమకొండలో జరిగింది. ఇంతకుముందున్న ఆశయ ఆదర్శాల్ని విస్తృతపరచి ఈ విధంగా నిర్వచిం చినారు: (అ) గ్రంథాల యాలను, పఠన మందిరాలను, పాఠశాలలను స్థాపించుట; (ఆ) విద్యార్థులకు సహాయము చేయుట; (ఇ) విద్వాంసులను గౌరవించుట; (ఈ) తాళపత్ర గ్రంథములను, శాసనముల ప్రతులను సంపాదించుట, పరిశీలించుట; (ఉ) కరపత్రములు, లఘు పుస్తకములు, ఉపన్యాసముల మూలమున విజ్ఞానమును వ్యాపింపజేయుట; (ఊ) ఆంధ్ర భాషా ప్రచారమునకై వలయు ప్రయత్నములు సలుపుట; (ఎ) వ్యాయామ ములను, కళలను ప్రోత్సాహపరచుట; (ఏ) అనాథలకు అత్యవసరమగు సహాయము చేయుట. నిజాం ప్రభువు 1921లోనే ‘గస్తీ నిసాన్‌ తిర్పన్‌’ అనే ఫర్మానాను జారీ చేసినాడు. దీని ప్రకారం సంస్థానంలో ఎక్కడ కూడ ఎటువంటి సభలు-అవి భాషా సంస్క ృతులకు సంబంధించినవైనా సరే- ముందు అనుమతి లేకుండా జరుపరాదు. ఈ అనుమతి కోసం హైదరాబాద్‌లోని కార్యాల యాల చుట్టూ తిరగవలసి వచ్చేది. నిర్వాహకుల్ని అధికారులు ముప్పతిప్పలు పెట్టే వాళ్ళు. మాడపాటి వారు ఒకసారి గ్రంథాలయోద్యమ మహాసభకు అనుమతి విష యమై హోం శాఖామాత్యులు ట్రెంచ్‌ దొరను కలిస్తే ‘గ్రంథాలయాలనే విప్లవకేంద్రా లంటూ’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడట! సిరిసిల్లలో జరిగిన గ్రంథాలయ మహాస భలో పువ్వాడ వెంకటప్పయ్య అనే కార్యకర్త తెలుగు భాషాభివృద్ధి గురించి మాట్లా డుతుంటే సభలో ఉన్న తహసీల్దార్‌ కల్పించుకొని ‘సర్కారీ రఫ్త్‌రాలన్నీ ఉర్దూలో సాగుతుంటే, చచ్చిపోయిన తెలుగును బయటకు లాగనవసరం లేదంటూ ఘాటు గా విమర్శించినాడట. ఆ రోజుల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయందాకా బోధన అంతా ఉర్దూలోనే సాగుతుండేది. ఇదంతా ఒక ఎత్తైతే పాలకొడేటి వెంకట రామశర్మ అనే ఆంధ్ర సోదరుడు ఈ సంఘ కార్యకలాపాలు రాజకీయ, మతపరమైన స్వభా వం కలిగినవని ఆరోపిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాయడం మరీ ఘోరం. ఇవన్నీ ఆనాటి పరిస్థితుల కద్దం పట్టే సంఘటనలు. సంఘం కార్యక్రమాలన్నీ స్థానిక ప్రజ ల్లో నూతనోత్తేజం కల్పించడం వరకే పరిమితమై ఉండేవి. ఈ దశను దాటి మొత్తం తెలంగాణ ప్రజల్ని చైతన్యపరచి ఒకే ఉద్యమ వేదిక మీదికి చేర్చవలసిన అవసరాన్ని సంఘం నాయకులు గుర్తించినారు. ఆ క్రమంలో అక్కడక్కడా ఆంధ్ర మహాసభల్ని జరుపుతూ వచ్చినారు.


No Response to "జాగృతినుంచి విముక్తి దాకా"

Leave A Reply